(Local) Mon, 28 Sep, 2020

ఏపీ మారిటైం బోర్డు ఏర్పాటు - సీఎం వైఎస్ జగన్

November 23, 2019,   11:10 AM IST
Share on:
ఏపీ మారిటైం బోర్డు  ఏర్పాటు - సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ మారిటైం బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటికే విశాఖ మేజర్ పోర్టుతో పాటు 14 నాన్ మేజర్ పోర్టుల అభివృద్ది జరుగుతోందని వెల్లడించారు. మరిన్ని పోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. పోర్టుల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తీరప్రాంత కారిడార్‌లో పరిశ్రమలను పెంచి పోర్టుల ద్వారా ఎగుమతి, దిగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రపంచంలో ఎగుమతులు, దిగుమతుల రంగంలో రాష్ట్రాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. 

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.