(Local) Wed, 20 Oct, 2021

డైలమాలో సీఎం జగన్

September 30, 2019,   11:41 AM IST
Share on:
డైలమాలో సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ కు విశ్రాంత ఇంజనీర్ల సంఘం లేఖ రాసింది. తెలంగాణ మీదుగా గోదావరి జలాలను శ్రీశైలానికి తరలిస్తే ఎగువ రాష్ట్రాలు ఆ నీటిలో వాటా కోరే ప్రమాదముందని వారు హెచ్చరించారు. దీంతో ఏపీ కేటాయింపుల్లో కోత పడవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం నుంచి మళ్లీస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుందన్నారు. వర్షాభావ ప్రాంతాలైన రాయలసీమ,నెల్లూరు ప్రకాశం జిల్లాలకు నీటి సరఫరా పై తమ ప్రతిపాదనలను పరిశీలించాలని వారు కోరారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లు సమావేశమై గోదావరి జలాలను కృష్ణకు అనుసంధానం చేసే దాని పై చర్చించారు. దీని వల్ల నష్టాలున్నాయని ఏపీ విశ్రాంత ఇంజనీర్ల సంఘం లేఖ రాయడంతో సీఎం జగన్ కాస్త డైలమాలో ఉన్నారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్‌ ...
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.