(Local) Sun, 16 Feb, 2020

తన పథకాన్ని తానే పరీక్షించిన సీఎం జగన్

November 22, 2019,   11:52 AM IST
Share on:
తన పథకాన్ని తానే పరీక్షించిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ తన పథకాన్ని తానే పరీక్షించారు. ఆయన ఓ సాధారణ పౌరుడిలా మారి టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల ఇసుక అక్రమ రవాణా, అధిక ధరలకు సంబంధించి ప్రభుత్వం శాండ్ టోల్ ఫ్రీ నంబర్ 14500ను అమల్లోకి తీసుకువచ్చింది. దీనికి ఎవరైనా ఫోన్ చేసి ఇసుక అక్రమ రవాణా జరిగినా, అధిక రేట్లకు విక్రయించినా, అక్రమాలకు పాల్పడినా ఫిర్యాదు చేయవచ్చు. లేదా ఇతర విషయాలు తెలుసుకోవచ్చు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ 14500 కాల్ సెంటర్ కు ఫోన్ చేశారు. వెంటనే అక్కడి ఉద్యోగి స్పందించి శాండ్ మైనింగ్ హెల్ప్ లైన్ సెంటర్ అని అంది. దీనికి స్పందించిన సీఎం జగన్ ఇసుక హెల్ప్ లైన్ సెంటర్ అంటే బాగుంటుందని అన్నారు. వెంటనే పక్కన అధికారి జోక్యం చేసుకొని సీఎం జగన్ మాట్లాడుతున్నారని చెప్పారు.  ఇసుక ఎక్కువ రేటుకు అమ్మితే ఏం చేస్తారని సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రతిగా ఉద్యోగిని.. ఫిర్యాదు చేసుకొని తప్పు చేసిన వారికి జరిమానా, జైలు శిక్ష విధిస్తామని సమాధానం తెలిపింది. దీంతో సీఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేసి పలు సూచనలిచ్చారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.