(Local) Fri, 15 Nov, 2019

సీఎం జగన్ గ్రామవాలంటీర్ల విషయంలో మరో కీలక నిర్ణయం

October 07, 2019,   5:21 PM IST
Share on:
సీఎం జగన్ గ్రామవాలంటీర్ల విషయంలో   మరో కీలక నిర్ణయ ...

ఏపీ సీఎం జగన్ నేడు మరో కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో గ్రామవాలంటీర్లకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ. 5 వేల నుంచి రూ.8 వేలకు పెంచాలని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించి నేడు ప్రధాన కార్యదర్శితో చర్చించి ఆయన నిర్ణయం తీసుకోనున్నారు. గ్రామ వాలంటీర్ల పోస్టుల కోసం జూన్ లో నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించారు. ఆగష్టు 15 నుంచి గ్రామ వాలంటీర్లు విధుల్లో చేరారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,92,848 మంది వాలంటీర్లకు గాను 1,85,525 మంది విధుల్లో ఉన్నారు. మిగిలి ఉన్న వాలంటీర్ల పోస్టులను కూడా అక్టోబర్ 15 నాటికి భర్తీ చేయాలని సీఎం జగన్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అవసరమైతే అర్హతలను ఇంటర్ వరకు తగ్గించి భర్తీ చేయాలని సూచించారు. అయితే వాలంటీర్ల గౌరవ వేతనానికి సంబంధించి నేడు అధికారిక ప్రకటన ఉండనుందని తెలుస్తోంది. సీఎం జగన్ మానవతా దృక్పథంతో వ్యవహరించి జీతాలు పెంచే నిర్ణయం తీసుకోబోతున్నందుకు వాలంటీర్లు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.