(Local) Mon, 23 Sep, 2019

సుప్రీంకోర్టులో చిదంబరంకు ఎదురుదెబ్బ

August 26, 2019,   1:10 PM IST
Views: 100
Share on:
సుప్రీంకోర్టులో చిదంబరంకు ఎదురుదెబ్బ

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరంకు సోమవారం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చిదంబరంకు ముందస్తు జామీనును తిర్సకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చిదంబరం తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌గా మార్చాలంటూ వారు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. చిదంబరంను సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సిబిఐ కోర్టులోనే రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవాలని సుప్రీంకోర్టు చిదంబరం తరఫు న్యాయవాదులకు సూచించింది.

ముందస్తు జామీను కోసం గతంలో దాఖలు చేసిన పిటిషన్‌కు ఇప్పుడు చెల్లుబాటు లేకుండా పోయిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి పేర్కొన్నారు. సిబిఐ రిమాండును సవాలు చేస్తూ మరో పిటిషన్‌ను చిదంబరం న్యాయవాదులు దాఖలు చేయనందున మధ్యంతర బెయిల్ కోసం తాము ఉత్తర్వులు జారీచేయలేమని ఆమె చెప్పారు.

సంబంధిత వర్గం
నేనే కశ్మీర్‌లో పర్యటిస్తా : జస్టిస్ గొగోయ్
నేనే కశ్మీర్‌లో పర్యటిస్తా : జస్టిస్ గొగోయ్
నేడు సుప్రీంకోర్టులో చిదంబరం కేసు విచారణ
నేడు సుప్రీంకోర్టులో చిదంబరం కేసు విచారణ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.