(Local) Mon, 26 Aug, 2019

ఆర్టికల్ రద్దు పై స్పందించిన చిదంబరం

August 12, 2019,   3:19 PM IST
Share on:

 కాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుపై  కేంద్రమాజీ మంత్రి పి.చిదంబరం స్పందించారు. కండబలంతో మోడీ ప్రభుత్వం కాశ్మీర్ ను విభజించిందని, ఆర్టికల్ 370ను రద్దు చేసిందని ఆయన ధ్వజమెత్తారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన బిజెపి పాలకులకు 72 ఏళ్ల చరిత్ర తెలియదని ఆయన పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీర్ లో ముస్లింలు అదికంగా ఉన్నందునే ఆర్టికల్ 370ను బిజెపి ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన ధ్వజమెత్తారు. జమ్మూకాశ్మీర్ లో హిందువుల సంఖ్య అధికంగా ఉండి ఉంటే ఆర్టికల్ 370ను రద్దు చేసేవారే కాదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడును కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేస్తే తమిళులు చూస్తూ ఊరుకోరని ఆయన చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుకు ఏడు పార్టీలు మద్ధతు ఇవ్వడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వర్గం

సుప్రీంకోర్టులో చిదంబరంకు ఎదురుదెబ్బ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.