(Local) Sun, 20 Jun, 2021

నాలుగో కక్ష్యలో చంద్రయాన్

August 31, 2019,   9:48 AM IST
Share on:
నాలుగో కక్ష్యలో చంద్రయాన్

చంద్రయాన్ 2 ఇప్పుడు అత్యంత విజయవంతంగా చంద్రుడి నాలుగో కక్షలో పరిభ్రమణలను పూర్తి చేసింది. చంద్రుడి వద్దకు అపూర్వ ప్రయోగానికి దిగిన ఇస్రో శుక్రవారం ఈ వివరాలను వెల్లడించింది. చంద్రుడి వద్దకు వ్యోమనౌక చేరడానికి మరో కక్ష మిగిలి ఉంది. చంద్రుడి చుట్టూ ఉండే పలు వలయాలను నిర్ణీత స్థాయిల్లో దాటుకుంటూ వెళ్లితే అనుకున్న విధంగా చంద్రయాన్ చంద్రుడి ఉపరితలానికి చేరుకుంటుంది. ఎటువంటి ప్రతిబంధకాలు, సాంకేతిక లొసుగులు లేకుండా చంద్రయాన్ వ్యోమనౌక పరిభ్రమణలు సాగుతున్నాయి.వ్యవస్థలోని ఇంజిన్లను ఇంధనంతో మండించడం ద్వారా కక్షల ఎత్తును పెంచి నిర్ణీత కక్షలోకి చేర్చే ప్రక్రియ చేపట్టారు. సాయంత్ర ఆరుగంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో 4వ కక్ష్యలోకి చంద్రయాన్ చేరింది. ఇక కొద్ది దూరంలో ఉన్న చంద్రుడి వద్దకు చేరేందుకు సర్వం సమాయత్తంగా ఉందని ఇస్రో వర్గాలు తెలిపాయి. నాలుగో కక్షలో చంద్రయాన్ నౌక తిరుగాడుతున్నప్పటి ఛాయాచిత్రాలను కూడా ఇస్రో వెలువరించింది. నాలుగో కక్షలో మొత్తం నాలుగు పరిభ్రమణలు జరగాల్సి ఉంది. ఇవన్నీ కూడా అనుకున్నట్లుగానే పూర్తయ్యాయి. ఇక సెప్టెంబర్ 1వ తేదీన భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం ఆరుగంటల నుంచి ఏడు గంటల మధ్యలో చంద్రయాన్ తదుపరి పరిభ్రమణలు ఉంటాయి.

సంబంధిత వర్గం
చంద్రయాన్ 2 గురించి గుడ్‌న్యూస్ చెప్పిన ఇస్రో చీఫ్ ...
చంద్రయాన్ 2 గురించి గుడ్‌న్యూస్ చెప్పిన ఇస్రో చీఫ్ ...
జాబిలికి మరింత చేరువగా చంద్రయాన్ -2
జాబిలికి మరింత చేరువగా చంద్రయాన్ -2

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.