(Local) Sat, 24 Jul, 2021

అంతిమ దశలో నెరవేరని భారత్ కల

September 07, 2019,   10:08 AM IST
Share on:
అంతిమ దశలో నెరవేరని భారత్ కల

చంద్రయాన్-2 రోవర్ ఇస్రోకు సంబంధాలు తెగిపోవడంతో చంద్రుడిపై కాలు పెట్టాలన్న భారత్ కల నెరవేరలేదు.  ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తల కృషిని యావత్ భారతావని మెచ్చుకుంటోంది.చంద్రునిపై 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా సాఫీగానే సాగింది. ఇక ల్యాండ్ అయ్యేందుకు నిమిషాల వ్యవధి మాత్రమే ఉందన్న తరుణంలో ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయని ఇస్రో చైర్మన్ ప్రకటించారు.ఈ రోజు తెల్లవారుజామున  1:38 గంటలకు ల్యాండర్ విక్రమ్ సేఫ్ ల్యాండింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. కక్ష్య నుంచి చంద్రుడిపై దిగే ప్రక్రియ 1:48 గంటలకు ల్యాండర్ ఫైన్ బ్రేకింగ్ వరకూ రాగలిగాం. లోకల్ నావిగేషన్ అందుకోవడానికి ఇంకా 2 నిమిషాల సమయం మాత్రమే ఉంది. కానీ, అనుకున్నట్లు జరగలేదు. పథకం ప్రకారం జరిగితే 1:52 గంటలకు ల్యాండర్ చంద్రుడి తొలి చిత్రాన్ని భూమికి పంపించి ఉండేది. మరునిమిషమే 1:53కి ల్యాండర్ చంద్రుడిపై సేఫ్‌గా దిగేది.దిగాల్సిన చోటుకు 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే ల్యాండర్ సిగ్నల్స్ కట్ అయ్యాయి. అప్పటికే కొద్దిగా దిశ మార్చుకుంటున్నట్లుగా స్క్రీన్‌పై కనిపించింది. ఇస్రో శాస్త్రవేత్తల ఆందోళనపడ్డారు. ఆ తర్వాత కాసేపటికి ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయినట్లుగా ఇస్రో చైర్మన్ ప్రకటించారు. డేటాను విశ్లేషిస్తున్నామని వివరించారు. రెండు అగ్ని పర్వతాల మధ్యలోనున్న ఎత్తైన ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసే విధంగా ప్లాన్ చేశారు. రెండు అగ్ని పర్వతాల మధ్యలోనున్న ఎత్తైన ప్రాంతంలో ల్యాండర్ చంద్రుడిపై దిగాల్సి ఉంది.

 

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.