(Local) Mon, 26 Aug, 2019

చంద్రబాబు కి గోడు వినిపించుకున్న కార్మికులు

August 07, 2019,   11:17 AM IST
Share on:

వ్యవస్థలో మార్పు తేవాలంటే ప్రణాళిక వేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకోని ముందుకెళ్లాలని చెప్పారు. పాత వ్యవస్థను రద్దు చేయడమో, మార్పు చేయడమో చేయాలన్నారు. అదేమీ లేకుండా పాత ఇసుక విధానం రద్దు చేశారని ట్విటర్‌ వేదికగా చంద్రబాబు విమర్శించారు. కొత్త ఇసుక విధానం ఎప్పుడో తీరిగ్గా వస్తుందని అంటున్నారు. కీలక విషయంపై ఏమిటీ పిల్లల ఆటలు? బాధ్యతాయుత స్థానంలో ఉండి మొండి నిర్ణయాలు తీసుకుంటారా? నిర్ణయం తీసుకునే ముందు పర్యవసానాలు ఆలోచించరా? లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ప్రజల సొంతింటి కలలు కడతేరిపోయాయి. ట్రాక్టర్‌ ఇసుక రూ. 10వేలు అంటున్నారు. వైసీపీ నేతల కోసమేనా ఇదంతా? అన్న క్యాంటీన్ల మూసివేతల వల్ల పేదలు ఆకలి తీర్చుకోవడానికి అవస్థలు పడడమే కాక, 20 వేలమంది క్యాంటీన్‌ ఉద్యోగులు జీవనోపాధి కోల్పోయారన్నారు. వీళ్లే కాదు ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల చిరుద్యోగులు, ఒప్పంద ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ న్యాయం జరిగే వరకూ పోరాడుతాం, అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

సంబంధిత వర్గం

అరుణ్ జెట్లి మృతి - ప్రముఖుల సంతాపం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.