(Local) Fri, 15 Nov, 2019

సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

October 04, 2019,   11:05 AM IST
Share on:
సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడ్రోజుల క్రితం శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించిన విషయంపై ప్రశ్నించారు. క్రైస్తవుడిని అని చెప్పుకునే సీఎం జగన్ తిరుమలలో డిక్లరేషన్ తీసుకోకుండా ఏడుకొండల వెంకన్న స్వామికి ఎలా పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. తిరుమల వెంకటేశ్వరుడి కన్నా జగన్ అతీతుడా అని నిలదీశారు. ఇంతకు ముందు ఇతర మతస్థులు తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారని, అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.
గతంలో వెంకటేశ్వరస్వామికి సంబంధించిన పింక్ డైమండ్ తన ఇంట్లో ఉందని అసత్య ప్రచారం చేసిన టీటీడీ ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి ఇప్పుడు మాట మార్చి పింక్ డైమండ్ లేదంటున్నారని చంద్రబాబు విమర్శించారు. పింక్ డైమండ్ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం శాశ్వతం కాదని, పోలీసులు అధికారులు అతిగా ప్రవర్తించొద్దని సూచించారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించకుండా చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలన్నారు.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.