(Local) Fri, 07 May, 2021

హైకోర్టు తీర్పు పై స్పందించిన చంద్రబాబు

August 22, 2019,   3:03 PM IST
Share on:
హైకోర్టు తీర్పు పై స్పందించిన చంద్రబాబు

పోలవరం జలవిద్యుత్తు ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు టిడిపి అధినేత చంద్రబాబు .ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడాతూ... తాజా తీర్పుపై ప్రభుత్వం ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది ఇక్కడితో ఆగదని.. ఈ జాప్యం ప్రాజెక్టుపై మరింత ప్రభావం చూపుతుందని అన్నారు. పోలవరంపై ప్రయోగాలు వద్దని ఎవరెన్ని చెప్పినా వినకుండా ప్రభుత్వం మూర్ఖంగా వెళ్లిందని ఆరోపించారు. లేని అవినీతిని నిరూపించాలని చూశారన్నారు.టెండర్లను రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలని కేంద్ర మంత్రి గడ్కరీ కూడా ఎన్నో సార్లు చెప్పారని చంద్రబాబు అన్నారు. ఒకసారి న్యాయ వివాదం మొదలైతే ప్రాజెక్టు నిర్మాణం జాప్యం జరుగుతుందని చెప్పారు. పోలవరంతో ప్రయోగాలు వద్దని తాము ముందు నుంచి చెబుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.