(Local) Sun, 17 Jan, 2021

కేంద్రం స్కెచ్, కేసీఆర్, జగన్ కు చెక్

September 28, 2019,   10:41 PM IST
Share on:
కేంద్రం స్కెచ్, కేసీఆర్, జగన్ కు చెక్

కేంద్రంలో మోడీ, అమిత్ షా స్కెచ్ లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో బలపడేందుకు ఇజ్జత్ మే సవాల్ గా  తీసుకున్న కాషాయం టార్గెట్ ఫిక్స్ చేసి మరీ దూసుకుపోతుంది. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీకి చెక్ పెట్టి వచ్చే ఎన్నికల వరకు బలంగా ఎదగాలని ఆరాట పడుతుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలకు చెక్ పెట్టేలా తన ప్రణాళిక ను సిద్దం చేసింది.గోదావరి జలాలను శ్రీశైలం తీసుకెళ్లడానికి తెలుగురాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ వ్యూహాలు అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు సమావేశమై చర్చించారు. అయితే ఈ వ్యూహానికి మోడీ సర్కార్ చెక్ పెట్టినట్లే తెలుస్తోంది. కేసీఆర్, జగన్ ను నొప్పించకుండా గోదావరి జలాలను కావేరితో అనుసంధానించాలని ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ విషయంపై కేంద్రం గట్టిగా ముందుకు వెళ్తే ఇద్దరు సీఎంల ప్లాన్ కు ఇక చెక్ పడినట్లే అవుతుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయినప్పటి నుంచి రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ సర్కార్ తో కలిసి గోదావరి జలాలను తీసుకువస్తామని చెప్పుకుంటూ వస్తోంది. గోదావరి నీటిని శ్రీశైలం డ్యాంకు తరలిస్తే బ్యాక్ వాటర్స్ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటిని పంపొచ్చు అయితే గోదావరి నుంచి శ్రీశైలం వరకు తవ్వే కాలువల ద్వారా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు నీటి సౌకర్యం దొరుకుతూ శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు వస్తాయి.

అయితే ఈ ప్రణాళిక ద్వారా అటూ రాయలసీమతో పాటు తెలంగాణలోని జిల్లాలకు కూడా లాభం జరుగుతుంది. ఇద్దరు సీఎంలు సమావేశమైనప్పటికీ ఎవరి వాటా ఎంతనే దానిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఈ పథకానికి నిధులను మొత్తం కేంద్రం నుంచే తీసుకువచ్చి నిర్మాణం చేపట్టాలని కేసీఆర్, జగన్ తో అన్నట్లు తెలుస్తోంది. నిధుల మంజూరు విషయంపై జగన్ ద్వారా కేంద్రాన్ని కేసీఆర్ డబ్బులు అడిగించినట్లు సమాచారం.ఒకవేళ కేంద్రం ప్లాన్ వేసినట్లు గోదావరి జలాలను కావేరితో అనుసంధాన నిర్ణయం అమలైతే తెలుగు రాష్ట్రాలు తలపెడుతున్న పథకానికి కేంద్రం ఒక్కరూపాయి కూడా ఇవ్వకపోవచ్చు.

సంబంధిత వర్గం
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.