(Local) Mon, 12 Apr, 2021

జమ్ముకాశ్మీర్‌,లడక్‌ ప్రాంతాల ఉద్యోగులకు ఏడోవేతన సంఘం సిఫారసుల అమలు

October 23, 2019,   1:14 PM IST
Share on:
జమ్ముకాశ్మీర్‌,లడక్‌ ప్రాంతాల ఉద్యోగులకు ఏడోవేతన స ...
కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడిన జమ్ముకాశ్మీర్‌,లడక్‌ప్రాంతాల ఉద్యోగులకు ఏడోవేతన సంఘం సిఫారసుల ఆధారంగానే జీతభత్యాలు అందుతాయి. ఈనెల 31వ తేదీనే వారికి జీతాలు చెల్లిస్తామని కేంద్రం వెల్లడించింది. జమ్ముకాశ్మీర్‌కు 370వ అధికరణం, 35ఎ అధికరణాలనను రద్దుచేసి స్వతంత్ర ప్రతిపత్తిని తొలగించడంతో ఇపుడు జమ్ముకాశ్మీర్‌, లడక్‌ ప్రాంతాలు భారత్‌లోని చట్టాలు సమానంగా వర్తింపచేసే విధంగా కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. జమ్ముకాశ్మీర్‌కు అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగాను, లడక్‌ను అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఏడో వేతన సంఘం సిఫారులను ఈ రెండు రాష్ట్రాల ఉద్యోగులకు చెల్లించేందుకు ఆమోద ముద్రవేసారు. ఇకపై ఈ రెండు రాష్ట్రాల ఉద్యోగులకు కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని భత్యాలు అమలవుతాయి. జీతభత్యాలు కూడా కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సరిసమానంగా ఉంటాయని అధికారులు వెల్లడించారు.
సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.