(Local) Mon, 12 Apr, 2021

రాహుల్,సోనియాలకు ఎస్పీజీ భద్రత తొలగింపు

November 09, 2019,   10:50 AM IST
Share on:
రాహుల్,సోనియాలకు ఎస్పీజీ భద్రత తొలగింపు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రతను తొలగించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. ఈ ముగ్గురి భద్రతపై ఇటీవల జరిగిన భద్రతా సమీక్ష సమావేశంలో చర్చించారు. ఆ నివేదిక ప్రకారమే వారికి ఎస్పీజీ భద్రత తొలగించినట్లు సమాచారం. వీరి భద్రతకు ఎలాంటి ముప్పు లేదని భావిస్తోన్న కేంద్రం.. ఎస్పీజీని తొలగించి జెడ్‌ప్లస్‌ భద్రతను కల్పించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. జడ్ ప్లస్ భద్రతను సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) పర్యవేక్షించనున్నది.ఈ ఏడాది ఆగస్టులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా ఎస్పీజీ భద్రతను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ కు జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నారు.  ఎస్పీజీ భద్రతను కేవలం రాష్ట్రపతి, దేశ ప్రధానికి మాత్రమే కేటాయిస్తారని, ఇతర నేతలకు అవసరం లేదని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న ఎస్పీజీ చట్టానికి ఆ మేరకు  సవరణ చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని, దాని కొరకు త్వరలోనే పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెడుతున్నట్లు చెబుతున్నారు. 

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.