(Local) Fri, 22 Oct, 2021

ఉన్నావ్ ఘటనపై ఢిల్లీ కోర్టుకు సీబీఐ రిపోర్టు

August 08, 2019,   1:15 PM IST
Share on:
ఉన్నావ్ ఘటనపై ఢిల్లీ కోర్టుకు సీబీఐ రిపోర్టు

ఉన్నావ్ ఘటనపై ఢిల్లీ కోర్టుకు సీబీఐ రిపోర్టు అందజేసింది. మైనర్ బాలికపై ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సింగార్ అత్యాచారానికి పాల్పడినట్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో సీబీఐ వెల్లడించింది. 2017 జూన్ 4న బాలికపై ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సింగార్, అతని అనుచరుడు శశి సింగ్ లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. ఈ విషయంపై  సీఎం యోగి ఆదిత్య నాథ్ కు లేఖ రాసినా పట్టించుకోలేదని తెలిపింది. 2018 జనవరి 12 వరకు కూడా బాధితురాలి తల్లి కోర్టును ఆశ్రయించే వరకు పోలీసులు ఎలాంటి  చర్యలు తీసుకోలేదని.. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారని బాధితురాలి తండ్రిని అరెస్ట్ చేశారన్నారు. పోలీసులు చావబాదడంతో 2018 ఏప్రిల్ 9న బాధితురాలి తండ్రి చనిపోయాడని సీబీఐ పేర్కొంది.

సంబంధిత వర్గం
డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట
డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.