(Local) Wed, 21 Oct, 2020

హైదరాబాద్ లో మరో కారు బీభత్సం

November 27, 2019,   2:49 PM IST
Share on:
హైదరాబాద్ లో మరో కారు బీభత్సం

హైదరాబాద్ బయోడైవర్సిటి కారు ప్రమాదం మరువక ముందే ఎల్బీనగర్ లో బుధవారం మరో కారు బీభత్సం సృష్టించింది. ఎల్బీనగర్ లోని అన్ లిమిటెడ్ షాపింగ్ మాల్ సమీపంలో కారు అతి వేగంగా దూసుకొచ్చి ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. ఆ తర్వాత కారు పల్టీలు కొడుతూ మెట్రో పిల్లర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న వెంకటమ్మ, సత్తమ్మ అనే మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఓజోన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంకటమ్మ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం సినిమా షూటింగ్ వలే తలపించిందని ప్రత్యక్ష సాక్షలు తెలిపారు. కారు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారుణమని వారు అన్నారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నా సర్కార్ , కానీ అధికారులు కానీ నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.