(Local) Sun, 20 Jun, 2021

జగన్ పై సెటైర్ వేసిన టీడీపీ ఎమ్మెల్సీ

November 02, 2019,   1:01 PM IST
Share on:
జగన్ పై సెటైర్ వేసిన టీడీపీ ఎమ్మెల్సీ

ఏపి అవతరణ దినోత్సవ వేడుకలను నిన్న విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, ప్రసంగ పాఠాన్ని చదువుతూ పలు పదాలను ఆయన తప్పులతడకగా ఉచ్ఛరించారు. ఈ వీడియోను టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్లో షేర్ చేశారు. జగన్ ను ఉద్దేశిస్తూ విజయసాయిరెడ్డిపై సెటైర్లు వేశారు. ”నిరా రక్షత’ అంటే నిరక్షరాస్యత, ‘దీవితాన్ని పణంగా’ అంటే జీవితాన్ని పణంగా, ‘సంఘ సస్కర్తలు’ అంటే సంఘ సంస్కర్తలు కాబోలు. ఆ ‘రాజిక సౌద్దన్నాన్ని’ అనేది మాత్రం అర్థం కాలేదు. మీకు అర్థమయితే చెప్పండి వీసారెడ్డి గారూ’ అంటూ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. మీ ముఖ్యమంత్రి జగన్ హీరోయిన్ల పేర్తు చదువుతున్నారేంటి? ఓహో… నిరక్షరాస్యతకు వచ్చిన పాట్లా ఇవి అంటూ బుద్దా వెంకన్న సెటైర్ వేశారు. చూడకుండా ప్రసంగించే వ్యక్తి తప్పు మాట్లాడినప్పుడు ‘పప్పు’ అంటూ మీరు సంబరపడ్డారని… చూసి కూడా చదవలేనివాడిని ఏమంటారు విజయసాయిరెడ్డిగారూ… ముద్దపప్పు అనే కదా అంటారు అంటూ ఎద్దేవా చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.