(Local) Fri, 23 Jul, 2021

పాక్ చొరబాటుదారుడ్ని పట్టుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు

October 03, 2019,   5:01 PM IST
Share on:
పాక్ చొరబాటుదారుడ్ని పట్టుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు

భారత్-పాక్ సరిహద్దుల్లో పాకిస్థాన్ దేశం నుంచి అక్రమంగా భారతదేశంలోకి చొరబడుతున్న ఓ పాకిస్థానీని సరిహద్దు భద్రతాదళం జవాన్లు పట్టుకున్నారు. అఖ్నూర్ సెక్టార్‌లోని దేశ సరిహద్దులను ఓ పాకిస్థానీ దాటుతుండగా పెట్రోలింగ్ చేస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. భారతదేశంలో దాడులు చేసేందుకు పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులను భారత్ లోకి పంపించేందుకు పాక్ సమాయత్తమైందని ఇంటలిజెన్స్ వర్గాలకు అందిన సమాచారం మేర సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్ల పహరాను ముమ్మరం చేశారు. పాకిస్థానీని బీఎస్ఎఫ్ జవాన్లు ప్రశ్నించినా అతను ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో బీఎస్ఎఫ్ జవాన్లు పాకిస్థానీని జమ్మూకశ్మీర్ పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.