(Local) Sun, 17 Jan, 2021

బ్రేకింగ్ : బోటు ఆపరేషన్‌లో పురోగతి...చిగురిస్తున్న ఆశలు

October 19, 2019,   11:03 AM IST
Share on:
బ్రేకింగ్ : బోటు ఆపరేషన్‌లో పురోగతి...చిగురిస్తున్ ...

కచ్చులూరు బోటు వెలికితీతలో ఆశలు చిగురిస్తున్నాయి. ధర్మాడి సత్యం బృందం రెండ్రోజులుగా చేస్తున్న ప్రయత్నంలో నిన్న  ఫలితం కనిపించింది. బోటు కోసం వేసిన లంగర్‌కు బోటు రైలింగ్ తగిలింది. దాన్ని లాగడంతో రైలింగ్ ఊడి బయటకొచ్చింది. ప్రమాదం జరిగిన బోటు మునిగిన ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో బోటు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అలాగే బోటు వంద అడుగులు లోతులోనే ఉన్నట్లు గుర్తించారు. ఒడ్డుకు చేర్చిన రెయిలింగ్‌ను చూసిన అధికారులు, ధర్మాడి సత్యం బృందానికి బోటును వెలికితీయగలమన్న నమ్మకం బలపడింది. బోటు జాడ, అది ఉన్న లోతు తెలియడంతో వెలికితీత ప్రయత్నాలకు ఆశలు మొదలయ్యాయి. గత నెల 15న మునిగిన బోటులో 41మంది మరణించారు. వారిలో 13మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. లైట్ ఫెయిల్ కావడంతో వెలికితీత పనులు ఆపేయగా రేపు మరలా మొదలు పెట్టనున్నారు. ఈ రోజు మధ్యాహ్నంలోగా బోటును వెలికితీసే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.