(Local) Thu, 29 Oct, 2020

రాజధానికి వచ్చి శ్మశానంలా ఉన్న ప్రాంతాలను చూస్తారా ?: బొత్స

November 25, 2019,   11:43 PM IST
Share on:
రాజధానికి వచ్చి శ్మశానంలా ఉన్న ప్రాంతాలను చూస్తారా ...

మాజీ సీఎం చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈనెల 28న రాజధాని అమరావతిలో ప్రాంతంలో పర్యటిస్తానంటున్న చంద్రబాబు.. అక్కడికి వచ్చి శ్మశానంలా ఉన్న ప్రాంతాలను చూస్తారా అని విమర్శించారు. నాలుగు భవనాలను 50శాతం మేర నిర్మిస్తే దానిని రాజధాని నిర్మించడం అంటారా అని ప్రశ్నించారు. ఈ విషయంలో చంద్రబాబును రాజధాని ప్రాంత రైతులు నిలదీయాలని మంత్రి బొత్స అన్నారు. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రాజధాని అంశంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారని మంత్రి వ్యాఖ్యానించారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రైతులకు కౌలు ఇస్తామన్న మాటను నిలబెట్టుకుంటామన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.