(Local) Thu, 29 Oct, 2020

రాజధాని పై త్వరలో కీలక ప్రకటన - బొత్సా

August 21, 2019,   12:23 PM IST
Share on:
రాజధాని పై త్వరలో కీలక ప్రకటన - బొత్సా

మంత్రి బొత్స సత్యనారాయణ ఏపి రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..." ఏపీ రాజధాని గురించి ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని, త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం ప్రకటించబోతున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుత రాజధాని అమరావతిలో సాధారణ వ్యయం కంటే నిర్మాణ వ్యయమే మోయలేనంత భారంగా మారుతోందని అన్నారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంలో ప్రజాధనం విపరీతంగా దుర్వినియోగం అవుతోందని తెలిపారు. గత కొన్నిరోజులుగా వరదలు రావడంతో రాజధానిలో ముంపుకు గురయ్యే ప్రాంతాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తేలిందని, ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎక్కడిక్కడ కాలువలు, డ్యామ్ లు నిర్మించాల్సి ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇదేమంత సమంజసమైన వ్యవహారం కాదని బొత్స స్పష్టం చేశారు. ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని అన్నారు.అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంలో ఇన్ని సమస్యలు ఉన్నాయని, ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని మరికొన్ని రోజుల్లో కీలక నిర్ణయం ప్రకటిస్తున్నామని చెప్పారు. ఆ ప్రకటనలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని ముద్దాడిన చంద్రబాబు
రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని ముద్దాడిన చంద్రబాబు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.