(Local) Mon, 12 Apr, 2021

కచ్చులూరులో బోటు వెలికితీతకు మళ్లీ అంతరాయం

October 19, 2019,   5:05 PM IST
Share on:
కచ్చులూరులో బోటు వెలికితీతకు మళ్లీ అంతరాయం

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో బోటును వెలికి తీసేందుకు మళ్లీ అంతరాయం ఏర్పడింది. యాంకర్ కు దొరికినట్టే దొరికి బోటు పట్టు వదిలేసింది. అయితే బోటు వద్దకు వెళ్లేందుకు గజ ఈతగాళ్లు వెనకడుగు వేస్తున్నారు. బోటులోనే మృతదేహాలు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ దాని దగ్గరకు వెళ్లేందుకు మొగ్గు చూపట్లేదు. ఈ నేపథ్యంలో ధర్మాడి సత్యం విశాఖలో ఉన్న గజ ఈతగాళ్లతో మాట్లాడేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. విశాఖ నుంచి గత ఈతగాళ్లు వచ్చాక బోటు వెలికితీత పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. బోటు ప్రమాదంలో ఇప్పటివరకు 35 మృతదేహాలను బయటకు తీయగా మరో 10మందికి పైగా వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.