(Local) Tue, 22 Sep, 2020

వారి వైఫల్యాలు మా పై రుద్దడం ఆశ్చర్యంగా వుంది - పురందరేశ్వరి

August 22, 2019,   3:52 PM IST
Share on:
వారి వైఫల్యాలు మా పై రుద్దడం ఆశ్చర్యంగా వుంది - పు ...

నిన్న వైస్సార్సీపీ ఎంపీలు  కేంద్ర మంత్రి పీయూష్ను కలిశాక విజయసాయిరెడ్డి  మీడియా తో మాట్లాడుతూ..ఏపీ ప్రభుత్వానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని ..,వీరిద్దరినీ సంప్రదించాకే జగన్ ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత పురంధేశ్వరి మండిపడ్డారు. విద్యుత్ పీపీఏల పున:సమీక్ష, పోలవరం రివర్స్ టెండరింగ్ నెపాన్ని విజయసాయిరెడ్డి తమపై రుద్దడం ఆశ్చర్యంగా ఉందని ఆమె తెలిపారు.వైసీపీ ప్రభుత్వం కూడా గతంలో టీడీపీ ప్రభుత్వం తరహాలోనే వ్యవహరిస్తోందని విమర్శించారు. తమ వైఫల్యాలను బీజేపీపైకి నెట్టివేసి చేతులు దులుపుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం, విద్యుత్ పీపీఏలపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రాసిన లేఖను మర్చిపోవద్దని పురంధేశ్వరి సూచించారు. బీజేపీ కూడా ఈ అంశాలపై ఆందోళన వ్యక్తం చేసిందని చెప్పారు. ఇంత జరిగితే మోదీ, అమిత్ షాలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని ఎలా సమర్థిస్తారని ఆమె ప్రశ్నించారు.

సంబంధిత వర్గం
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.