(Local) Wed, 23 Sep, 2020

బీజేపీ ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

August 28, 2019,   2:05 PM IST
Share on:
బీజేపీ ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో వైసీపీ సర్కార్ సముఖంగా లేనట్లు కనిపిస్తోందని, తనకున్న సమాచారాన్ని బట్టి అమరావతిని రాజధానిగా కొనసాగించే అవకాశం లేదన్నారు. గత ప్రభుత్వం రాజధాని అమరావతిలో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రస్తుతం అమరావతి విషయంలో వస్తున్న అపోహాలకు పుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాజధానికి  5వేల ఎకరాలు సరిపోతాయని, రాజధాని నిర్మాణ విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే సంబంధించిన విషయమని జీవీఎల్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని జీవీఎల్ మరోసారి స్పష్టం చేశారు.

సంబంధిత వర్గం
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.