(Local) Fri, 07 May, 2021

వైసీపీపై నిప్పులు చెరిగిన కన్నా లక్ష్మీనారాయణ

August 16, 2019,   4:18 PM IST
Share on:
వైసీపీపై నిప్పులు చెరిగిన కన్నా లక్ష్మీనారాయణ

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీపై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది అవినీతిపరులను పట్టుకున్నారని ప్రశ్నించారు. మైనింగ్ అక్రమ రవాణాలో కేవలం వ్యక్తులు మాత్రమే మారారని, వ్యవహారమంతా గతంలో మాదిరే జరుగుతోందని చెప్పారు.వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమతో ఎన్నో పనులు చేయించుకున్నారని, ఇప్పుడు అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పల్నాడులో తలపెట్టిన ధర్నాను వాయిదా మాత్రమే వేశామని, రద్దు చేయలేదని తెలిపారు. పల్నాడు ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని కన్నా తెలిపారు.

సంబంధిత వర్గం
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.