(Local) Thu, 04 Jun, 2020

ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలలో ఇన్‌ఛార్జులు నియామకం

August 21, 2019,   2:45 PM IST
Share on:
ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలలో ఇన్‌ఛార్జులు నియ ...

హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, దిల్లీల్లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలపై అమిత్‌షా పార్టీ సీనియర్‌ నాయకులు, కేంద్ర మంత్రులతో సమావేశం నిర్వహించారు. పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు.. ఈ నాలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల సందర్భంగా నాయకులకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలను అప్పగించి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సన్నద్ధమై ఉండాలని సూచించారు. కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జావడేకర్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌లను దిల్లీ, హరియాణా ఎన్నికలకు ఇన్‌ఛార్జులుగా నియమించారు.

అదేవిధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్‌ యాదవ్‌, ఉపాధ్యక్షుడు ఓం మాథుర్‌లకు మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జులుగా బాధ్యతలను అప్పగించారు. ప్రత్యర్థి పార్టీల నుంచి భాజపాలోకి చేరాలనుకునే నాయకులను సక్రమంగా పరిశీలన చేయాలని అధినాయకత్వం సూచించినట్లు పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌లు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో, అదేవిధంగా దిల్లీలో వచ్చే ఏడాది ఆరంభంలో నిర్వహించనున్నట్లు సమాచారం.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.