(Local) Thu, 24 Sep, 2020

తిరుపతి బస్సు టికెట్లపై బిజెపి ఆందోళన

August 23, 2019,   3:00 PM IST
Share on:
తిరుపతి బస్సు టికెట్లపై బిజెపి ఆందోళన

తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద బస్సు టికెట్లపై అన్యమత ప్రకటనలను నిరసిస్తూ బిజెపి కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ.. తిరుపతిలో బస్‌టికెట్ వెనుక జెరూసలెం గురించి ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ విషయం సిఎం జగన్‌కు తెలుసా? అని ప్రశ్నించారు. ఈ పద్ధతిని వెంటనే రద్దు చేయాలని, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. శ్రీశైలం విషయంలో స్పందించినట్లే ఇక్కడ కూడా సీఎం స్పందించాలని కోరారు.

సంబంధిత వర్గం
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.