(Local) Wed, 12 May, 2021

బీహార్ మాజీ సీఎం కన్నుమూత

August 19, 2019,   1:20 PM IST
Share on:
బీహార్ మాజీ సీఎం కన్నుమూత

బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జగన్నాథ్ మిశ్రా మూడు సార్లు బీహార్ సీఎంగా పని  చేశారు.  మిశ్రా కాంగ్రెస్, ఎన్ సీపీ, జనతాదళ్ యూ పార్టీలలో పని చేశారు. కాంగ్రెస్ తరపున బీహార్ కు పని చేసిన చివరి సీఎం జగన్నాథ్ మిశ్రా. జగన్నాథ్ మిశ్రా సోదరుడు నారాయణ మిశ్రా ఇందిరాగాంధీ కేబినేట్ లో రైల్వే శాఖ మంత్రిగా పని చేశారు. బీహార్ యూనివర్శిటీలో  జగన్నాథ్ మిశ్రా ఆర్ధిక శాస్త్ర నిపుణుడిగా  పనిచేశారు. ఆ తర్వాత ఆయన  రాజకీయాల్లోకి వచ్చారు. పశుదాణా కుంభకోణం కేసులో మిశ్రా నిందితుడిగా ఉన్నారు. ఇటీవలే రాంచీ కోర్టు ఆయనను నిర్దోశిగా ప్రకటించింది. జగన్నాథ మిశ్రా మృతితో పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.

సంబంధిత వర్గం
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.