(Local) Sat, 24 Jul, 2021

ఆటో డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని జరిమానా

September 16, 2019,   3:05 PM IST
Share on:
ఆటో డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని జరిమానా

కొత్త మోటారు వాహన చట్టం అమలులోకి వచ్చిన అనంతరం భారీగా వసూలు చేస్తున్న జరిమానాలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించిన వారి నుండి అధికారులు భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. అయితే బీహార్‌లో మాత్రం ఆటోడ్రైవర్‌ సీటుబెల్డ్‌ పెట్టుకోని కారణంగా వెయ్యి రూపాయల జరిమానా పడింది. వివరాల్లోకి వెళితే బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లాలోని సరియాలో ఓ ఆటోడ్రైవర్‌ ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు జరిమానా విధించారు.డ్రైవర్‌ వద్ద తగిన డబ్బులు లేకపోవడంతో తక్కువ మొత్తంలో చలానా జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అది కూడా సీటు బెల్లు ధరించని కారణంగా కనీస చలానా పరిథి వెయ్యిరూపాయలు విధించారు. దీనిపై స్టేషన్‌ అధికారి స్పందిస్తూ తాను మినిమం చలానా చెల్లిస్తానని ఆటోడ్రైవర్‌ విజ్ఞప్తి చేశాడని, దీంతో రూ.1000లను కట్టించుకున్నామని, సీటు బెల్డ్‌ పెట్టుకోని కారణంగా అతనికి ఈ జరిమాన పడిందని పేర్కొనడం పొరపాటుగా జరిగిందని అన్నారు.

సంబంధిత వర్గం
ప్రముఖ కోలీవుడ్ నటుడు కన్నుమూత..!
ప్రముఖ కోలీవుడ్ నటుడు కన్నుమూత..!
ఆ ట్రాఫిక్ పోలీసులు ఎంత మంచొళ్లంటే…
ఆ ట్రాఫిక్ పోలీసులు ఎంత మంచొళ్లంటే…

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.