(Local) Sun, 27 Sep, 2020

కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాజీనామా

August 06, 2019,   12:37 PM IST
Share on:
కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు, చీఫ్‌ విప్‌ భువనేశ్వర్‌ కలిత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆర్టికల్‌ 370 విషయంలో విప్‌ జారీ చేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఇది దేశ ప్రజల వైఖరికి విరుద్ధం. పార్టీ ఎప్పటిలానే విధ్వంసం వైపు వెళుతోంది. అందులో నేను భాగస్వామిని కాలేను. అందుకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’ అని పేర్కొన్నారు. అసోం నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఆయన పదవీ కాలం  2020 ఏప్రిల్‌ 9తో ముగియనుంది

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.