(Local) Mon, 12 Apr, 2021

త్వరలో భద్రాద్రి టెంపుల్ పునరుద్దరణ పనులు !

November 01, 2019,   4:12 PM IST
Share on:
త్వరలో భద్రాద్రి టెంపుల్ పునరుద్దరణ పనులు !

తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల పునరుద్దరణపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో భద్రాచలం రాములోరి ఆలయ పనులు ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ పునరుద్దరణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఫిబ్రవరిలో మహా సుదర్శన యాగం తర్వాత టెంపుల్ పూర్తిగా భక్తులకు అందుబాటులోకి రానుంది. యాదాద్రి టెంపుల్ ఆర్కిటెక్ ఆనంద్ సాయికి భద్రాద్రి టెంపుల్ డిజైన్లు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం సీఎం కేసీఆర్ తో ఆనంద్ సాయి సమావేశమై డిజైన్లను చూపించారని సమాచారం. త్వరలో మంచి ముహూర్తం చూసుకుని డిజైన్లను అధికారికంగా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 60 ఎకరాల్లో ఉన్న భద్రాచలం టెంపుల్ ను 100 ఎకరాల వరకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఆలయం చుట్టూ గ్రీనరి కనిపించేలా ఏర్పాట్లు చేయనున్నారు.

భద్రాచలం సీతారాముల స్వామి ఆలయ పనులకు త్వరలో చినజీయర్ స్వామి శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020 శ్రీరామనవమి తర్వాత పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే బడ్జెట్ లో టెంపుల్ ప్లాన్ కు డబ్బులు కేటాయించనున్నారు. దాదాపు రూ.450 కోట్లతో అత్యద్భుతంగా ఆలయాన్ని పునరుద్దించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.