(Local) Mon, 18 Nov, 2019

టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు -భరత్

August 26, 2019,   10:58 AM IST
Share on:
టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు -భరత్

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఇప్పుడున్న నాయకులు సమర్థులేనని, వారితో పార్టీ పటిష్ఠంగానే ఉందని భావిస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ వస్తేనే పార్టీ బలోపేతం అవుతుందన్న వాదనతో తాను ఏకీభవించనని అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనవడిగా, ఛరిష్మా ఉన్న నటుడుగా జూనియర్ ఎన్టీఆర్ ను కలుపుకుని పోవాల్సిన బాధ్యత పార్టీపై ఉంది కదా... అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాల్లో ఆసక్తి ఉంటే ఆ విషయం తమ పార్టీ అధినేతకు తెలియజేయాలని, ఆపై వారిద్దరూ చర్చించుకుని ఓ నిర్ణయం తీసుకుంటారని భరత్ వివరించారు.ఇప్పటి టీడీపీ యువ నాయకత్వం కొత్త ఆలోచనలతో ముందుకెళ్లగలిగితే పార్టీని తామే బలోపేతం చేసుకోగలమని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఆనాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట సామాన్యులే ఉన్నారని, వారందరూ జూనియర్ ఎన్టీఆర్ లు  కాదు కదా అంటూ భరత్ తన అభిప్రాయాలు పంచుకున్నారు.

సంబంధిత వర్గం
వైసీపీకి షాక్.... జగన్ మతంపై టీడీపీ తీవ్ర విమర్శలు
వైసీపీకి షాక్.... జగన్ మతంపై టీడీపీ తీవ్ర విమర్శలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.