(Local) Mon, 30 Nov, 2020

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన ఆస్ట్రేలియా మంత్రి జానస్ వుడ్

November 11, 2019,   11:54 AM IST
Share on:
గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన ఆస్ట్రేలియా మంత్రి జానస ...

రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన “గ్రీన్ ఛాలెంజ్” కార్యక్రమం రాష్ట్రం , దేశం , ఖండాంతరాలు దాటింది.  ఆస్ట్రేలియా డిప్యూటీ మినిస్టర్ జాసన్ వుడ్ కు  టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు  కాసర్ల నాగేందర్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన జాసన్ వుడ్, “గ్రీన్ ఛాలెంజ్” కార్యక్రమం ఆవశ్యకతను తన వీడియో సందేశం ద్వారా తెలంగాణ సమాజానికి అందించి, ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన సంతోష్ కుమార్ ని అభినందించారు .
నాగేందర్ రెడ్డి కి స్వయంగా మొక్కను అందించిన జాసన్ వుడ్ ఇటువంటి సామాజిక స్పృహ ఉన్న కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు  నాగేందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు . తెలంగాణ రాష్ట్రం  ఏర్పడిన  తరువాత జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి , ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజక్టు గురించి తెలుసుకుని ఆనందాన్ని వ్యక్తం చేసి , తెలంగాణ కు వచ్చి తన కళ్లారా చూస్తానని తెలపడం జరిగింది . అడ్వైసరి  బోర్డు చైర్మన్ డా అనిల్ కుమార్ చీటీ , విక్టోరియా స్టేట్ ఇంచార్జి సాయిరాం ఉప్పు ,నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్  సాయి యాదవ్ లతో పాటు  ఆస్ట్రేలియా లిబరల్ నాయకులు ఈ కార్యక్రమం లో  పాల్గొనడం జరిగింది .

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.