(Local) Mon, 12 Apr, 2021

రూపుదిద్దుకుంటున్న వాజ్‌పేయి శిలావిగ్రహం

November 11, 2019,   12:12 PM IST
Share on:
రూపుదిద్దుకుంటున్న వాజ్‌పేయి శిలావిగ్రహం

రాజస్థాన్‌లోని జైపూర్‌లో మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి శిలావిగ్రహం రూపుదిద్దుకుంటోంది. ఈ విగ్రహాన్ని యూపీ ప్రభుత్వం తయారుచేయిస్తోంది. కంచుతోపాటు ఇతర లోహాల మిశ్రమాన్ని ఈ విగ్రహం తయారీలో వినియోగిస్తున్నారు. దీనిని ప్రముఖ శిల్ప కళాకారుడు రాజ్‌కుమార్ పండిత్ తీర్చిదిద్దుతున్నారు. 25 అడుగులు ఎత్తున్న ఈ విగ్రహ నిర్మాణం వచ్చే డిసెంబరు చివరినాటికి పూర్తయి యూపీలోని లక్నోకు చేరుకోనుంది. అక్కడ ఈ విగ్రహాన్ని నెలకొల్పనున్నారు.  ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ వాజ్‌పేయి తనకు ఎంతో ఇష్టమైన నాయకుడని, ఆయన ప్రసంగాలను ఎంతో ఆసక్తిగా వినేవాడినని అన్నారు. ఈ సందర్భంగా యూపీ ప్రభుత్వం వాజ్‌పేయి విగ్రహం తయారుచేసే అవకాశం కల్పించడం పట్ల రాజ్‌కుమార్ హర్షం వ్యక్తం చేసారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.