(Local) Sun, 17 Oct, 2021

ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్న నేతలు

November 18, 2019,   7:11 PM IST
Share on:
ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్న నేతలు

ఆర్టీసి జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలు ఉస్మానియా  ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. వారు వెంటనే దీక్ష విరమించకపోతే వారి పరిస్థితి విషమంగా మారే అవకాశం ఉందని ఉస్మానియా ఆస్పత్రి ఆర్ఎంవో తెలిపారు. నేతల ఆరోగ్య పరిస్థితి దిగజారుతుండడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆర్టీసి కార్మికులు చేపట్టిన సమ్మె 45వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసి జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి శనివారం నిరవధిక దీక్షకు దిగారు. ఆయన దీక్షను పోలీసులు ఆదివారం సాయంత్రం భగ్నం చేసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోనే అశ్వత్థామరెడ్డి దీక్ష కొనసాగిసున్నారు. మరో జేఏసీ నేత రాజిరెడ్డి కూడా దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష చేస్తున్న నేతలను పలువురు నేతలు, ఆర్టీసి కార్మికులు పరామర్శించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.