(Local) Sat, 19 Sep, 2020

నిలకడగా అరుణ్ జైట్లీ ఆరోగ్యం...

August 12, 2019,   3:09 PM IST
Share on:
నిలకడగా అరుణ్ జైట్లీ ఆరోగ్యం...

మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే . అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం  నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.  జైట్లీ గుండెకు రక్త ప్రసరణ బాగానే జరుగుతోందని. చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తోందని వారు వెల్లడించారు. ఎయిమ్స్‌లో ప్రత్యేక వైద్య బృందం జైట్లీ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తోన్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎయిమ్స్‌కు వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జైట్లీ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.

సంబంధిత వర్గం
కోట్లా క్రికెట్ స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు
కోట్లా క్రికెట్ స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.