(Local) Tue, 20 Oct, 2020

ఇందిరా గాంధీ పైనే అరుణ్ జెట్లీ తోలి పోరాటం

August 24, 2019,   2:06 PM IST
Share on:
ఇందిరా గాంధీ పైనే అరుణ్ జెట్లీ తోలి పోరాటం

అరుణ్ జైట్లీ విద్యార్ధి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. ఆయన లా విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించారు. దీనిని అరుణ్ జైట్లీ వ్యతిరేకించి, విద్యార్ధి నాయకుడు కావడంతో అప్పుడు ఉద్యమించాడు. దీంతో జైట్లీని మీసా చట్టం కింద అరెస్టు చేసి జైల్లో వేశారు. ఆయన 19 నెలల పాటు జైల్లోనే గడిపారు. ఆయన ఓ విద్యా సంవత్సరాన్ని కూడా నష్టపోయారు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఏబీవీపీ అలిండియా జనరల్ సెక్రటరీగా జైట్లీ నియమితులయ్యారు. ఇదే సమయంలో ఢిల్లీలోని ఇండియన్ ఎక్స్ ప్రెస్ భవనాన్ని కూల్చివేయాలని ఇందిరాగాంధీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా జైట్లీ పోరాడారు. ఇలా రెండు సార్లు కూడా ఇందిరాగాంధీ పై పోరాడి జైట్లీ గుర్తింపు సాధించారు. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి అంచలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి స్థాయి వరకు అరుణ్ జైట్లీ ఎదిగారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.