(Local) Sat, 26 Sep, 2020

చింతమడకలో 500 మందికి ఆరోగ్య పరీక్షలు

August 03, 2019,   11:35 AM IST
Share on:
చింతమడకలో 500 మందికి ఆరోగ్య పరీక్షలు

సీఎం కేసీఆర్ చింతమడక పర్యటనలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సమగ్ర ఆరోగ్య పరీక్షల నిర్వహణకు యశోద ఆస్పత్రి వైద్యులచే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో వైద్యశిబిరం ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి సమీక్షించి మాట్లాడారు. జడ్పీ హైస్కూల్‌ను సందర్శించి అక్కడ వైద్య శిబిర ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

చింతమడక గ్రామంలో 2800 మందికి, మాచాపూర్‌లో 837 మందికి, సీతారాంపల్లిలో 800 మందికి సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ఫ్రోఫైల్ తయారు చేయనున్నామన్నారు. చింతమడక గ్రామంలో ఏర్పాటు చేసిన వార్డులలో ప్రతిరోజు 500 మందికి పూర్తి ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్య శిబిరానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పూర్తి వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వర్గం
సమగ్ర ఆరోగ్య సూచిక ...చరిత్రలో సువర్ణాక్షరాలతో నిల ...
సమగ్ర ఆరోగ్య సూచిక ...చరిత్రలో సువర్ణాక్షరాలతో నిల ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.