(Local) Wed, 03 Jun, 2020

కాశ్మీర్ నుండి సుమారు 70 మంది ఉగ్రవాదులు ఆగ్రాకు తరలింపు...

August 09, 2019,   3:31 PM IST
Share on:
కాశ్మీర్ నుండి సుమారు 70 మంది ఉగ్రవాదులు ఆగ్రాకు త ...

కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న అనంతరం జమ్మూకశ్మీర్‌లో అమలులో ఉన్న ఆంక్షలను కొనసాగిస్తూ మరిన్ని చర్యలు తీసుకుంది. కశ్మీర్‌ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 70 మంది ఉగ్రవాదులు, కరడుగట్టిన వేర్పాటువాదులను ప్రత్యేక ఎయిర్‌ ఇండియా విమానంలో ఆగ్రా జైలుకు తరలించింది. వివిధ కారణాలతో విధులకు దూరంగా ఉన్న  డివిజినల్‌, జిల్లా స్థాయి ఉద్యోగులతో పాటు సచివాలయ ఉద్యోగులు తక్షణమే విధుల్లో చేరాలని కశ్మీర్‌ ప్రభుత్వం ఆదేశించింది. వారి విధులు సాఫీగా సాగేలా తగిన ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.  కాగా ఈ ఆంక్షల నేపథ్యంలో కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో జన జీవనానికి కొంత మేర ఆటంకం ఏర్పడింది.

సంబంధిత వర్గం
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.