(Local) Mon, 23 Sep, 2019

కార్గిల్ యుద్ధమాజీ సైనికుడిపై 'విదేశీయుడు' ముద్ర

June 10, 2019,   12:13 PM IST
Views: 170
Share on:
కార్గిల్ యుద్ధమాజీ సైనికుడిపై 'విదేశీయుడు' ముద్ర

మనదేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను ఉంచే నిర్బంధ కేంద్రం నుంచి కార్గిల్ యుద్ధవీరుడు, ఆర్మీ రిటైర్డ్ సుబేదార్ మొహమ్మద్ సనావుల్లా శనివారం నాడు విడుదల అయ్యారు.  30 ఏళ్లపాటు భారత సైన్యంలో పనిచేసి 2017లో ఆయన పదవీ విరమణ చేశారు. ఆయన భారతీయుడు కాదని జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) తేల్చి చెప్పింది. 52 ఏళ్ల సనాఉల్లాను మే 23న ఒడిశాలోని  కామరూప్ (రూరల్)లో ఉన్న విదేశీ ట్రైబ్యునల్ ఎఫ్‌టీ కోర్ట్ ‘నంబర్ 2 విదేశీయుడు’గా ప్రకటించింది. దీంతో ఇటీవల ఆయనను నిర్బంధ కేంద్రానికి తరలించారు.

కాగా గువహాటి హైకోర్టు ఆయనకు 20 వేల రూపాయలు, ఆయన బయోమెట్రిక్, ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.బెయిల్‌ నుంచి విడుదలైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.."‘‘నేను భారతీయుడిని. ఇక్కడే ఉంటాను. ఈ మట్టిని విడిచి ఎక్కడికీ పోయేది లేదు’’ అని స్పష్టం చేశారు.. అంతే కాకుండా తనకు బెయిల్ ఇచ్చినందుకు కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.‘‘2008లో ఇక విచారణ కార్యాలయం నా కేసును ప్రారంభించింది.అయితే 2018 వరకు ఆ విషయం నాకు తెలియదు.
ఎన్‌ఆర్‌సీలో నా పేరు చూసిన మరుక్షణం ఆశ్చర్యపోయాను . అందులో నా పేరు ఉందని అప్పుడే తెలిసింది. వెంటనే నేను విచారణకు  హజరై నా వివరాలు తెలియజేశాను’’ అని సనాఉల్లా తెలిపారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.