(Local) Sun, 07 Mar, 2021

వరద ముంపునకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించండి

August 23, 2019,   3:04 PM IST
Share on:
వరద ముంపునకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం  చెల్లి ...

వరద ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు, పనులు లేక ఇబ్బందిపడుతున్న వ్యవసాయ కూలీలకు ఆరు నెలల పాటు నష్టపరిహారం చెల్లించాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, పార్టీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ అప్పికట్ల భరత్ భూషణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్క గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం  పరిధిలోని 17 లంక గ్రామాలు కృష్ణా వరదతో తీవ్రంగా నష్టపోయాయని, ఇప్పటికి వరద నీటిలోనే ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ లోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ని ఈరోజు ఆయన కలిశారు. వరద నష్టంపై రూపొందించిన ఓ నివేదికను పవన్ కు అందజేశారు. రైతులు, కార్మికులు, మత్స్యకార్మికులు, చేతివృత్తులవారు, డ్వాక్రామహిళలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను ఆయనకు వివరించారు.

సంబంధిత వర్గం
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.