(Local) Wed, 03 Jun, 2020

ఏపీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

August 13, 2019,   10:58 AM IST
Share on:
ఏపీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పొందూరులో సోమవారం జరిగిన గ్రామ వాలంటీర్ల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వాలంటీర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. “మీ పై ఆరోపణలు వచ్చాయని ఎవడో టీడీపీ వాడు, కోన్ కిస్కా గొట్టంగాడు పిటిషన్లు వేస్తే మీరేమి భయపడవద్దు. దైర్యం చేసుకొని ముందుకు వెళ్లండి. మీ వెనుక నేనున్నాను. ఏ గొట్టంగాళ్లు అడ్డుతగిలినా భయపడవద్దు. మీరు జగన్మోహన్ రెడ్డి ప్రతినిధులు. మీ వెనుకు మేముంటాం” అంటూ స్పీకర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ మాటలు హాట్ టాపిక్ గా మారాయి.  
 

సంబంధిత వర్గం
రాజధాని రైతుల్లో ఆనందం
రాజధాని రైతుల్లో ఆనందం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.