(Local) Mon, 27 Sep, 2021

మద్యపాన నిషేదంలో ఏపీ సర్కార్ మరో ముందడుగు

September 25, 2019,   10:44 AM IST
Share on:
మద్యపాన నిషేదంలో ఏపీ సర్కార్ మరో ముందడుగు

ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేదం దిశగా అడుగులు వేస్తున్న జగన్ సర్కార్ అందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయానికి పరిమితులు విధించింది. పర్మిట్, లైసెన్స్ లేకుండా ఒక వ్యక్తి కలిగివుండే లిక్కర్‌పై పరిమితి విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం 3 సీసాలు, మితలేటెడ్ స్పిరిట్ 3 బల్క్  లీటర్లు, బీరు 6 సీసాలు, కల్లు 2 బల్క్  లీటర్లు అమ్మాలని ప్రభుత్వం పేర్కొంది. పలు దశల వారీగా మద్యపాన నిషేదం చేస్తామని ఏపీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం జగన్ మద్యపాన నిషేదానికి పాటుపడుతున్న విధానాన్ని అంతా అభినందించారు. మద్యపాన నిషేదం ద్వారా లక్షలాది కుటుంబాలు బాగుపడుతాయని పలువురు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వర్గం
అవినీతి పై యుద్దం ప్రకటించిన ఏపీ సర్కార్
అవినీతి పై యుద్దం ప్రకటించిన ఏపీ సర్కార్
ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది: చంద్రబాబు
ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది: చంద్రబాబు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.