(Local) Fri, 22 Oct, 2021

మద్యం దుకాణాల్లో కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

August 20, 2019,   3:18 PM IST
Share on:
మద్యం దుకాణాల్లో కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తుల  ...

ఏపీ సీఎం జగన్ లిక్కర్ పాలసీలో సమూల మార్పులు చేస్తున్నారు. ఇందుకోసం కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చి మద్యం దుకాణాల్లో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సేల్స్‌మెన్,సూపర్ వైజర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి రానున్న నేపథ్యంలో అప్పటిలోగా ఉద్యోగాల నియామకాలు పూర్తి చేసేందుకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

తాజాగా వెలుబడిన నోటిఫికేషన్ ప్రకారం సేల్స్‌మెన్ ఉద్యోగంలో చేరాలంటే ఇంటర్ అర్హత కలిగి ఉండాలి. సేల్స్ సూపర్‌వైజర్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ ప‌రిజ్ఞానం ఉండాలనే నిబంధన పెట్టారు. 21 నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఆన్‌లైన్‌లో ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మద్యం షాపు ఉన్న మండలానికి చెందిన వారే ఆయా షాపుల్లో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవాలి.  సూపర్ వైజర్‌కు రూ. 17,500 జీతం, సేల్స్‌మెన్‌కు రూ. 15,000 వరకు జీతాలు ఇవ్వనున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కూడా కల్పించనున్నారు.

కాగా ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మద్యం పాలసీ అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుంది. గతంలో 4,380 మద్యం షాపులు ఉండగా.. ఈసారి 3,500లకు కుదించింది. ఎమ్మార్పీ బోర్డులు కచ్చితగా ఏర్పాటు చేయాలనే నిబంధన పెట్టింది. దీంతోపాటు ప్రతీ మద్యం షాపులో ప్రభుత్వం కాంట్రాక్టు పద్దతిలో ముగ్గురు సేల్స్‌మెన్లు,సూపర్‌వైజర్, ఒక వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత వర్గం
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.