(Local) Sun, 20 Jun, 2021

బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

September 27, 2019,   11:16 AM IST
Share on:
బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసిన  ఏపీ ప్రభుత్వం

విశాఖపట్నం మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో 1521.078 హెక్టార్లకు సంబంధించిన ఆరు బాక్సైట్‌ మైనింగ్‌ లీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాక్సైట్‌ తవ్వకాలకు స్వస్తి చెబితే సర్కారు ఆదాయం కోల్పోతుందని కొందరు ఉన్నతాధికారులు, ఆర్థిక నిపుణులు సూచించినా సీఎం జగన్ అంగీకరించలేదు. సర్కారుకు ఆదాయం ఒక్కటే ముఖ్యం కాదని, గిరిజనుల విశ్వాసాలు, అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిందేనని చెప్పారు. మరో 30 ఏళ్లపాటు మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ నిర్ణయం పై పలువురు మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.

 

 

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.