(Local) Thu, 14 Nov, 2019

సీఎం కేసీఆర్ వద్దనుకున్నారు.. సీఎం జగన్ పదవిచ్చారు

October 05, 2019,   10:32 AM IST
Share on:
సీఎం కేసీఆర్ వద్దనుకున్నారు.. సీఎం జగన్ పదవిచ్చారు

మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళికి ఏపీ ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. ఏపీ పాఠశాల విద్య సలహాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆకునూరి మురళి తెలంగాణ సర్వీసులో కొనసాగారు. ఆయన తెలంగాణ ప్రభుత్వ తీరు పై పలుసార్లు కీలక వ్యాఖ్యలు చేయడంతో ఆయనను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేశారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనను ప్రాధాన్యత లేని తెలంగాణ స్టేట్ ఆర్కివ్స్ సంచాలకునిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ తర్వాత ఐఏఎస్ లపై తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు పై అసహనం కూడా వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐఏఎస్ ల సమావేశం కూడా నిర్వహించారు. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసిన మురళి తనకు పది నెలల సర్వీస్ ఉండగానే 2019 జూలై 27 న వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిని తెలంగాణ ప్రభుత్వం 2019 సెప్టెంబర్ 16న ఆమోదించింది. దీంతో ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తెలంగాణలో వ్యతిరేకత ఎదుర్కొన్నా తన ప్రాధాన్యతను గుర్తించిన ఏపీ ప్రభుత్వం ఏపీ పాఠశాల విద్యా శాఖకు సలహాదారుడిగా నియమించింది. అయితే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎందుకంటే సీఎం కేసీఆర్, జగన్ లు మిత్రులు. తెలంగాణలో సీఎం కేసీఆర్ వద్దనుకున్న వ్యక్తికి ఏపీలో సీఎం జగన్ కీలక పదవి కట్టబెట్టడం పై చర్చ జరుగుతోంది. ఏదేమైనా ప్రతిభను గుర్తించి సీఎం జగన్ పదవి కట్టబెట్టడం పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.