(Local) Sun, 20 Jun, 2021

ప్రభుత్వ పథకాలకు నాలుగు కొత్త కార్డులు

November 16, 2019,   1:11 PM IST
Share on:
ప్రభుత్వ పథకాలకు నాలుగు కొత్త కార్డులు

ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకానికైనా ఇప్పటివరకు రేషన్ కార్డును మాత్రమే ప్రాతిపదికగా ఉపయోగించేవారు. ఇప్పుడు ఏపీ సర్కార్ రేషన్ కార్డు కేవలం రేషన్ పొందడానికి మాత్రమే పనికి వచ్చేలా చెయ్యనుంది . ప్రభుత్వ పథకాలను పొందడానికి ఏపి ప్రభుత్వం మరో నాలుగు కొత్త కార్డులను ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆయా పథకాలకు సంబంధించిన ప్రజల అర్హతను బట్టి కార్డులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. పాత రేషన్ కార్డు మాత్రం రద్దు చేయకుండా ప్రభుత్వ పథకాల కోసం మాత్రం ప్రత్యేకంగా కొత్త కార్డులను కేటాయిస్తారు. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కార్డును ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.