(Local) Thu, 29 Oct, 2020

అవినీతి పై యుద్దం ప్రకటించిన ఏపీ సర్కార్

November 18, 2019,   7:13 PM IST
Share on:
అవినీతి పై యుద్దం ప్రకటించిన ఏపీ సర్కార్

ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో అవినీతిని చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఏసీబీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. అవసరమైతే చట్ట సవరణ చేసేందుకు కూడా సర్కార్ సిద్దమైతుంది. ప్రభుత్వ శాఖల్లో అవినీతి మూలాలను పరిశోధించేందుకు ఐఐఎం అహ్మదాబాద్ నిపుణుల సహకారం తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్, విద్యా వైద్య శాఖల పై ముందుగా నిపుణులు పరిశోధన చేయనున్నారు. ఏపీలో అవినీతి లేకుండా చేయాలన్న లక్ష్యంతో సర్కార్ ముందుకు పోతుందని సమాచారం. 

సీఎం జగన్ అవినీతి పై యుద్దం ప్రకటించారని వైసీపీ నేతలు తెలిపారు. ప్రజలు నిత్యం అనేక సమస్యలతో వివిధ శాఖలకు పోతారని కానీ వారి పనులు ఏండ్ల తరబడి పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉంటున్నాయన్నారు. వారు త్వరగా పనులు పూర్తి చేసుకోవాలంటే లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అందుకే సర్కార్ అవినీతి రహిత పాలను అందించేందుకు సిద్దమైందన్నారు. త్వరలోనే ఏపీ అవినీతి రహిత పాలనగా మారుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు. దశల వారీగా అన్ని శాఖల్లో పరిశోధన చేసి అవినీతి లేకుండా చేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.