(Local) Sat, 24 Jul, 2021

చేనేత వస్త్రాలను ఆన్ లైన్ ద్వారా అమ్మాలని ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

October 28, 2019,   2:07 PM IST
Share on:
చేనేత వస్త్రాలను ఆన్ లైన్ ద్వారా అమ్మాలని ఏపీ సర్క ...

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చేనేతలకు తోడ్పాటునిచ్చేలా ఈ నిర్ణయం ఉంది. ఇక నుంచి చేనేత వస్త్రాలను ఆన్ లైన్ ద్వారా అమ్మాలని సర్కార్ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రముఖ ఆన్ లైన్ సంస్థలైన అమెజాన్-ఫ్లిప్ కార్ట్ లతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. నవంబర్ 1 నుంచి ఈ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఇక నుంచి ఆన్ లైన్ లో పట్టు చీరలు,దోవతులు, చొక్కాలు, అన్ని రకాలైనా చేనేత ఉత్పత్తులను పొందవచ్చు. చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ఆన్ లైన్ ద్వారా అమ్మకాలకు శ్రీకారం చుడుతోంది. ముందుగా 25 రకాల ఉత్పత్తులను అమెజాన్ ద్వారా విక్రయిస్తున్నారు. నవంబర్ చివరి వారంలో ఫ్లిప్ కార్ట్ ద్వారా కూడా సేవలు అందుబాటులోకి రానున్నాయి. రూ.500 నుంచి రూ.20వేల వరకు ధరలున్న ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి. దీని ద్వారా చేనేత కార్మికులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రానుంది. ఇప్పటికే చేనేతలకు వైఎస్సార్ చేనేత హస్తం పథకం కింద రూ.24 వేల రూపాయలను అందించేందుకు సర్కార్ శ్రీకారం చుట్టింది. చేనేతల మార్కెటింగ్ కోసం ఆన్ లైన్ అమ్మకాలు చేపట్టి సర్కార్ అండగా నిలిచిందని, ఈ నిర్ణయం పై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.