(Local) Sat, 24 Jul, 2021

నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ భేటీ

August 08, 2019,   10:16 AM IST
Share on:
నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్టానికి రావల్సిన నిధులతో పాటు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని కోరినట్లు ఏపీ సర్కార్ వర్గాలు తెలిపాయి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ.5వేల కోట్లను కూడా విడుదల చేయాలని కోరారు.

సంబంధిత వర్గం
జగన్‌ పాలనపై జనసేన వ్యంగ్యాస్త్రాలు
జగన్‌ పాలనపై జనసేన వ్యంగ్యాస్త్రాలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.